
దళపతి విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.

. హెచ్.వినోద్ డైరెక్షన్‌లో దళపతి 69 పేరుతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది.

ఈ మూవీలో దళపతి సరసన పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసింది.

ఈ చిత్రంలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తుండగా మరో ప్రధాన 5. పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు.

ఈ సినిమాకు సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించనున్నారు.

‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజుతో పాటు గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



