భారీ ఈవెంట్గా ఏపీ రాజధాని శంకుస్థాపన | ap state capital city foundation ceremony become big event | Sakshi
Sakshi News home page

భారీ ఈవెంట్గా ఏపీ రాజధాని శంకుస్థాపన

Published Mon, Sep 28 2015 5:44 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

ap state capital city foundation ceremony become big event

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఈవెంట్గా ప్రభుత్వం నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం...  ప్రయివేట్ కన్సల్టెన్సీకి ఈ ఈవెంట్ బాధ్యతలు అప్పగించనుంది. విజ్క్రాప్ట్ కన్సెల్టెన్సీకి ఈవెంట్ నిర్వహణ కట్టబెట్టింది.  ఇందుకోసం రూ.9.50కోట్లు చెల్లించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. మరోవైపు రాజధాని శంకుస్థాపనను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

కాగా అక్టోబర్ 22 విజయదశమి రోజున జరిగే ఈ కార్యక్రమాన్ని పూర్తి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. ఈ శంకుస్థాపనకు భారత, సింగపూర్‌ ప్రధానమంత్రులతో పాటు జపాన్ విదేశాంగ మంత్రి హాజరవుతుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement