
సాక్షి,సిటీబ్యూరో: పాతబస్తీ పేట్లబురుజు ప్రాం తంలోని నిథాయి దాస్‌కు చెందిన బంగారు నగల తయారీ కార్ఖానాలో జరిగిన బందిపోటు దొంగత నం కేసులో ప్రధాన సూత్రధారి అమ్జద్ భార్య సైతం నిందితురాలిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు. ఈమె చిక్కితేనే బంగారం రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక బృందం ముంబై సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఆమె కోసం గాలింపు చేపట్టిం ది. ముంబైకి చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్ తరచూ నిథాయిదాస్‌కు చెందిన కార్ఖానాలకు వచ్చి కొత్త గా మార్కెట్‌లోకి వచ్చిన, తాను రూపొందించిన డిజైన్లను చూపించేవాడు. ఈ నేపథ్యంలోనే అత ను పేట్లబురుజులోని కార్ఖానాలకు అనేకసార్లు వ చ్చాడు. అక్కడ జరుగుతున్న లావాదేవీలు, సె క్యూరిటీ ఏర్పాట్లు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించిన అతను ఈ విషయాన్ని తన స్నేహితుడైన ముంబైలోని థానే వాసి అమ్జద్ ఖాజాకు చెప్పాడు.
అప్పటికే దాదాపు 40 దోపిడీలు, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్న అమ్జద్ జ్యువెలరీ డిజైనర్ ఇచ్చిన సమాచార ంతో గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ కార్ఖానాను టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేప థ్యంలో ముంబైలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాత నేరగాళ్లతో ముఠా ఏర్పాటు చేశాడు. వీరు అమ్జద్ ఇంట్లో నాలుగైదుసార్లు సమావేశమయ్యా రు. ఈ సమావేశాల్లో పాల్గొన్న అమ్జద్ భార్య సైత ం బందిపోటు దొంగతనం చేయడానికి కొన్ని సలహాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొలుత అరెస్టు చేసిన అమ్జద్ తన భార్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు బయ టపెట్టలేదు. అయితే ఆపై చిక్కిన మరో ముగ్గురు నిందితులు షాకీర్, జాకీర్, మసూద్ చెప్పిన వివరాలతో అమ్జద్ భార్యను నిందితుల జాబితాలో చేర్చారు. మార్చ్ 5న ముంబై నుంచి బయలుదేరిన అమ్జద్ నేతృత్వంలోని ముఠా వేర్వేరుగా ఆ మరుసటి రోజు హైదరాబాద్ చేరుకుంది.
మార్చ్ 6న బంగారు నగల కార్ఖానాను కొల్లగొట్టి దాదాపు 3.5 కేజీల బంగారం ఎత్తుకుపోయింది. మరుసటి రోజు షోలాపూర్ చేరుకున్న వీరు అక్క డే సొత్తును అమ్జద్‌కు అప్పగించారు. నగలను ఓ బ్యాగ్‌లో పెట్టుకున్న అతను థానేలోని తన ఇంటి కి చేరుకున్నాడు. అమ్జద్ భార్య కోసం అక్కడకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేయగా, మార్చ్ 7న అమ్జద్ బ్యాగ్‌తో ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అమ్జద్ అరెస్టు తర్వాత ఆ బ్యాగ్‌తో పాటు అతడి భార్య కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో అది నగల బ్యాగ్ గా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సెల్‌ఫోన్ సైతం స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితులు, చోరీ సొత్తు పై దృష్టి కేంద్రీకరించారు.