
అన్నానగర్: కలియక్కావిలై సమీపంలో భర్తపై అనుమానంతో అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కుమరి జిల్లా కలియక్కోవిలై సమీపం మరియగిరి తెంగువిలైకి చెందిన షర్జిన్ (28) కేరళలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కేరళకు చెందిన బబితను(27)ప్రేమించి 2010లో వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత భార్య బబితతో కలిసి సొంత ఊరు తెంగువిలైలో షర్జిన్ నివసిస్తున్నాడు. వీరికి ఏంజల్ (05) అనే కుమార్తె ఉంది. ఇటీవల షర్జిన్ తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది.
వేరే మహిళతో భర్త షర్జిన్‌కి సంబంధం ఉందని బబితకి అనుమానం ఏర్పడింది. ఈ విషయాన్ని ఆమె షర్జిన్‌ను అడగడంతో వారికి మధ్య తగాదా ఏర్పడింది. ఈ స్థితిలో శుక్రవారం రాత్రి షర్జిన్ ఇంట్లో నుంచి కేకలు వినబడ్డాయి. వెంటనే స్థానికులు వెళ్లి చూడగా షర్జిన్ తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. సమీపంలో ఓ ఇనుప రాడ్‌తో బబితా నిలబడి ఉండడం చూసి వారు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే స్థానికులు షర్జిన్‌ను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి బబితాని అరెస్టు చేసి విచారణ జరిపారు. ఇందులో భర్త షర్జిన్‌కు వేరే మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో అతన్ని హత్యచేసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బబిత పోలీసులకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment