వివాహేతర సంబంధం.. అడ్డంగా దొరికిన పోలీస్‌ | Constable Runs Illegal Affair With Another Woman In Cheryala | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. అడ్డంగా దొరికిన కానిస్టేబుల్‌

Published Fri, Apr 27 2018 8:28 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable Runs Illegal Affair With Another Woman In Cheryala - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చేర్యాల: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఓ కానిస్టేబుల్‌ ఆయన భార్యకు దొరికిపోయాడు. ఈ సంఘటన చేర్యాల మండలంలో చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలకేంద్రంలో కానిస్టేబుల్‌గా పని చేస్తోన్న గూడెళ్లి రమేష్‌, మమతలు 2006లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరి స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా మర్పడగాబంగ్లా మండలం బావూజీగూడెం. 2011లో రమేశ్‌కు కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది.

అయితే కొంతకాలంగా భార్యా, పిల్లలకు దూరంగా ఉంటూ చేర్యాలలో మరో మహిళతో కలిసి ఉంటున్నాడు. ఈ విషయం తెలిసి మమత ఆయన ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. కోపంలో ఇరువురిపై దాడి చేసింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement