దుగ్గిరాల : భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందే సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మణికంఠ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
భార్య రాలేదనే కానిస్టేబుల్ ఆత్మహత్య
Nov 6 2016 9:46 PM | Updated on Mar 19 2019 9:03 PM
దుగ్గిరాల : భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందే సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మణికంఠ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుగ్గిరాల ఎస్‌ఐ మన్నెం మురళి తెలిపిన వివరాల ప్రకారం... దుగ్గిరాల చెన్నకేశవనగర్‌కు చెందిన నెలవంటి మణికంఠ ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడాది విశాఖపట్టణం జిల్లా అనకాపల్లికి చెందిన లలితా పద్మిణిదేవితో వివాహం జరిగింది. దీపావళి సెలవుల నిమిత్తం అక్టోబర్ 14వ తేదీ మణికంఠ స్వగ్రామం దుగ్గిరాలకు వచ్చాడు. మణికంఠ దంపతుల మధ్య గతకొద్దికాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈనేపథ్యంలో నవంబర్ 2వ తేదీన లలితాపద్మిణిదేవి పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి ఇంటికిరాకపోవటంతో మనస్తాపం చెందిన మణికంఠ శనివారం సాయంత్రం సల్ఫాస్ మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి నెలవంటి సాంబశివరావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ మన్నెం మురళీ తెలిపారు.
Advertisement
Advertisement