కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
అంబర్‌పేట: కానిస్టేబుల్ భార్య ఉరేసుకొని ఆ త్మహత్య చేసుకున్న ఘటన సోమవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ విజయ్‌భాస్కర్ కథనం ప్రకారం... కర్నూల్ జిల్లా సాగలమర్రి గ్రామానికి చెందిన పుష్పలత(26), కడపకు చెందిన సి.అమర్‌నాథ్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కూతురు ప్రణవీ (3) సంతానం. అమర్‌నాథ్ అంబర్‌పేట పోలీస్టేషన్ ట్రైనింగ్ సెంటర్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వీరు అదే ప్రాంతంలో ఉన్న పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు.
వీరితో పాటు పుష్పలత సోదరి, అమర్‌నాథ్ తలి ్లకూడా ఉంటున్నారు. సోమవారం ఉదయం భర్త ఉద్యోగానికి, సోదరి టైలరింగ్ శిక్షణకు వెళ్లగా... అత్త క్వార్టర్స్‌లోని ఇరుగుపొరుగు వారితో మాట్లాడటానికి వెళ్లింది. ఇదే సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పుష్పలత తన గదిలో సీలింగ్ ప్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అంబర్‌పేట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతురాలు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌లో ‘అక్కా, నాన్న , సింధు నన్ను క్షమించండి. ప్రణవీని బాగా చూసుకోండి’ అని ఉంది. కాగా, పుష్పలత ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. అమర్‌నాథ్ తల్లికి వైద్యం చేయడానికి అయ్యే ఖర్చుల విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తినట్లు తెలిసిందన్నారు.