
సాక్షి, జనగామ : జిల్లాలోని నర్మెట్ట మండలం శివభూక్య తండాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత కన్న బిడ్డల్ని నరికి చంపి తనూ ఆత్మహత్యకు పాల్పడింది. భానోతు రమ పిల్లలు భాను శ్రీ (4), వరుణ్ (3)ను అతి దారుణంగా కత్తితో నరికి చంపింది. అనంతరం మెడ కోసుకుని తనూ చనిపోయేందుకు యత్నించింది. కొన ఊపిరితో ఉన్న రమను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆమె భర్త చెప్తుండగా.. భర్త వేధింపుల కారణంగానే రమ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారుల మృతితో తండా వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment