వీరఘట్టం మండలానికి చెందిన నవ వరుడు హత్య ఘటన సంచలనం కలిగించిన విషయం విదితమే. భార్య పన్నిన కుట్రతో భర్త ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జిల్లా ప్రజలు మరువక ముందే.. అచ్చం ఇలాంటి ఘటనే సంతబొమ్మాళి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. భార్య బరితెగించి భర్తపై చాకుతో దాడి చేసి గాయపరిచింది. పెళ్లయిన 20 రోజులకే తాళికట్టిన భర్తపైనే భార్య దాడి చేసిన సంఘటన చర్చనీయాంశమైంది.