మోసం చేసిన భర్తకు చెప్పుతో ‘సన్మానం’ | Wife Beats Husband In Mahabubabad | Sakshi
Sakshi News home page

May 25 2018 6:12 PM | Updated on Oct 8 2018 5:19 PM

Wife Beats Husband In Mahabubabad - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తికి స్థానికులు, బంధువులతో కలిసి దేహశుద్ధి చేసిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది. స్థానిక కూరగాయల మార్కెట్‌ వద్ద జరిగిన ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. వివరాల్లోకెళితే.. కేసముద్రం మండలం మహబూబ్‌పట్నంకు చెందిన శాలిని అనే గిరిజన మహిళకు అదే తండాకు చెందిన వీరన్న అనే వ్యక్తితో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది.

వివాహమైన ఆరు సంవత్సరాల వరకు వీరి కాపురం సజావుగానే గడిచింది. అనంతరం వీరన్న మరో పెళ్లి చేసుకుని శాలినికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.  దీంతో ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తోంది. విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లిచేసుకుందే కాక, తనపై పెట్టిన కేసు వాపసు తీసుకోవాలంటూ వీరన్న బెదిరించసాగాడు. దీంతో విసుగెత్తిన ఆమె స్థానికుల సాయంతో భర్తకు దేహశుద్ధి చేసింది. అందరూ చూస్తుండగా అతడిని వెంబడించి మరీ చెప్పుతో కొట్టింది. బట్టలు చించేసి చితక్కొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement