
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
పెద్దపల్లి: మాయలు లేవు.. మంత్రాలు లేవు.. భూతా లు దయ్యాలు అసలే లేవు.. అంటూ మేథావులు ఎంత మొత్తుకుంటున్నా.. అజ్ఞానాన్ని వీడని కొందరు ప్రాణా లు తీస్తున్నారు. ఇదే కోవలో మరో సంఘటన జరిగింది. పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి తమ్ముడి చేతిలో అన్నావదినలు దారుణంగా హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన తూముల నంబయ్య(60), కమల (53)లను నంబయ్య తమ్ముడు శంకర్ గొడ్డలితో నరికి చంపాడు.
కొంతకాలంగా తగాదాలు..
నంబయ్య సోదరులు ఐదుగురు ఒకే చోట పక్క పక్కనే నివాసముంటున్నారు. ఇరువురు అన్నదమ్ముల మధ్య భూ తగాదాల ఉన్నాయి. అలాగే కొంతకాలంగా తన అనారోగ్యానికి అన్నావదినలే కారణమని శంకర్ పగ పెంచుకున్నాడు. దీంతోనే వారిని చంపాలని నిర్ణయించుకున్న శంకర్ అదను కోసం చూసి చీకటి పడ్డాక ఇద్దరిపై దాడి చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం శంకర్ పరారయ్యాడు. మూఢ నమ్మకాలతో శంకర్ అత్యంతకిరాతకంగా వ్యవహరించాడని గ్రామస్తులు ఆవేదన చెందారు. సంఘటన జరిగిన గంట తర్వాత కూడా విషయం వెలుగులోకి రాలేదని తెలిపారు. పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్, సీఐ నరేందర్, ఎస్‌ఐ జగదీశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
మృతదేహాలు నేడు తరలింపు
నంబయ్య, కమలలను హతమార్చిన తీరుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హంతకుడు శంకర్ గొడ్డలిని ఉపయోగించాడా.. పదునైన ఆయుధాన్ని ఉపయోగించాడా.. అనేది మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తెలుస్తుందని ఏసీపీ హబీబ్‌ఖాన్ తెలిపారు. దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. వారిలో ఇద్దరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారని, కుమారుల సమక్షంలో మృతదేహాలను తరలించి పరీక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment