
సాక్షి, కర్నూలు : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ వ్యక్తి కొట్టి హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలులోని ఎన్టీఆర్ బిల్డింగ్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. తెలుగు రఘు, స్వాతి దంపతులు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. కుటుంబ కలహాలతో భర్తమద్యం సేవించి భార్యపై దాడి చేసి కిరాతకంగా కొట్టాడు. తీవ్రగాయాలతో స్వాతి అక్కడిక్కడే మృతి చెందింది.
రఘు మూడు సంవత్సరాల క్రితం స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్వాతికి తల్లిదండ్రులు లేరు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మరిన్ని విషయాలను వెలికి తీసేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment