
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో బిజీగా ఉన్నారు. తాజాగా న్యూయార్క్‌లోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో ఆయన సందడి చేశారు. రెస్టారెంట్‌లో ఇండియన్ వంటకాలను ఎన్టీఆర్ ఆస్వాదించారు. అక్కడ సిబ్బందితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు యంగ్ టైగర్. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ రెస్టారెంట్ చెఫ్, సిబ్బందితో పోజులిచ్చిన ఫోటోను ఎన్టీఆర్ తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు.
ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడిస్తూ.. "అంతర్జాతీయ పర్యటనలో అత్యుత్తమ భారతీయ ఆహారాన్ని రుచి చూశా. అమెరికాలో భారతీయ రెస్టారెంట్ వంటకాలు సూపర్. " అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఏడాది ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఆ చిత్రంలోని నాటు నాటు సాంగ్- 2023 ఆస్కార్ అవార్డుల కోసం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. అంతకుముందు ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023--ఉత్తమ చిత్రం - నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఒరిజినల్ సాంగ్ - మోషన్ పిక్చర్ నామినేషన్ జాబితాలో రెండు స్థానాలు దక్కించుకుంది. ప్రపంచంలోని టాప్ 50 ఆసియా సెలబ్రిటీల వార్షిక జాబితా- యూకేలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment