
తమిళసినిమా: ఆ భారీ మల్టీస్టారర్ చిత్రంలో కీర్తీసురేశ్ సెట్ అయినట్లేనా? అంటే అవుననే అంటున్నారు మీడియా వర్గాలు. కీర్తీసురేశ్ వరసు విజయాలతో దూసుకుపోతున్న నాయకి ఈమె. కీర్తీ ఉందంటే ఆ చిత్రం హిట్టే అన్నంత నమ్మకంగా మారింది. కోలీవుడ్‌లో తొలి చిత్రమే కాస్త నిరాశ పరిచింది. ఆ తరువాత అపజయం ఆమె దరిదాపులకు కూడా రావడానికి సాహసం చేయలేదు. తమిళంలోనే కాదు తెలుగులోనూ కీర్తీసురేశ్ విజయ పయనం అప్రతిహతంగా కొనసాగుతోంది. మహానటి (నడిగైయార్ తిలగం) కీర్తీలోని అభినయానికి నిలువుటద్దంగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రస్తుతం తమిళంలో విజయ్‌కు జంటగా సర్కార్, విశాల్ సరసన సండైకోళి–2, విక్రమ్‌తో సామి స్క్వేర్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.
ఈ మూడు చిత్రాల్లోనూ ఈ బ్యూటీ స్టార్ హీరోలతోనే రొమాన్స్ చేస్తుందన్నది గమనార్హం. మహానటి చిత్రం తరువాత టాలీవుడ్‌లో పలు అవకాశాలు వచ్చినా అంగీకరించడం లేదనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అయితే అది నిజమేనని, అందుకు కారణం కోలీవుడ్‌లో ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని కీర్తీసురేశ్ స్పష్టం చేసింది. తాజాగా మరో విషయం వెలుగులో కొచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించనున్న ఈ చిత్రంలో కీర్తీ ఒక భాగం కానుందని ప్రచారం జరగుతోంది. అందుకే ఈ అమ్మడు ఇప్పటి వరకూ తెలుగులో కొత్త చిత్రాలను అంగీకరించలేదని టాక్ వైరల్ అవుతోంది.
నిజానికి ఇంతకు ముందే ఇలాంటి ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని కీర్తీ కొట్టిపారేసింది. ఆ చిత్రంలో నటించమని ఇప్పటి వరకూ తననెవరూ సంప్రదించలేదని వివరణ ఇచ్చింది. అయితే అప్పుడే ఈ విషయం గురించి బయట పెట్టడం ఎందుకనో, లేక చిత్ర వర్గాల నుంచి ముందుగా ప్రకటన రావాలనో కీర్తీ అలా చెప్పి ఉండవచ్చునని, రాజమౌళీ చిత్రంలో కీర్తీసురేశ్ నటించడానికి ఫిట్ అన్నది దాదాపు ఖారారయ్యిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మీడియా వర్గాల టాక్. మరికొద్ది రోజులు ఆగితే నిజానిజాలు తెలుస్తాయి.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment