RRR Movie Tickets Prices: ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్ల ధరలు పెంపు | Telangana Govt Permission For RRR Ticket Price Hike | Sakshi
Sakshi News home page

RRR Movie Tickets Prices: ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్ల ధరలు పెంపు

Published Sun, Mar 20 2022 4:14 AM | Last Updated on Sun, Mar 20 2022 8:51 AM

Telangana Govt Permission For RRR Ticket Price Hike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా టికెట్ల ధరలు పెంచుకొనేందుకు అనుమతిస్తూ హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ నెల 18న ప్రభుత్వానికి టికెట్ల ధరల పెంపుతోపాటు ఐదో షో నిర్వహణకు అనుమతివ్వాలని దరఖాస్తు చేసుకుంది. దీనిపై సానుకూలంగా స్పందించిన హోంశాఖ... ఏసీ థియేటర్లలో ఈ నెల 25 నుంచి 27 వరకు అంటే 3 రోజులపాటు టికెట్‌పై రూ. 50 పెంచుకొనేందుకు అవకాశం కల్పించింది. అలాగే 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వరకు రూ.30 పెంచుకొనేలా వెసులుబాటు కల్పించింది.

రిక్లైనర్, మల్టీఫ్లెక్స్, లార్జ్‌ స్క్రీన్‌ థియేటర్లలో ఈ నెల 25 నుంచి 27 వరకు టికెట్‌పై రూ. 100 పెంచుకొనేందుకు అంగీకరించింది. ఆ తర్వాత 28 నుంచి వచ్చే నెల 3 వరకు టికెట్‌పై రూ. 50 పెంచుకునేలా అవకాశం కల్పించినట్టు హోంశాఖ ఇన్‌చార్జి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు సైతం అనుమతిచ్చినట్లు ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement