Yuzvendra Chahal Met Rrr Director Rajamouli at Formula e-Racing - Sakshi
Sakshi News home page

RRRతో RR.. వైరలవుతున్న రాజస్థాన్‌​ రాయల్స్‌ ట్వీట్‌

Published Sun, Feb 12 2023 3:59 PM | Last Updated on Sun, Feb 12 2023 4:24 PM

Chahal Met RRR Director Rajamouli At Formula E Racing - Sakshi

ఐపీఎల్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ నిన్న (ఫిబ్రవరి 11) చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఆర్‌ఆర్‌ స్టార్‌ బౌలర్‌, టీమిం‍డియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ యుజ్వేంద్ర చహల్‌, అతని భార్య ధనశ్రీ వర్మ నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ సందర్భంగా ప్రముఖ దర్శకుడు, RRR ఫేమ్‌ రాజమౌళిని కలిశాడు.

ఈ సందర్భంగా చహల్‌ దంపతులు రాజమౌళితో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను ఆర్‌ఆర్‌ యాజమాన్యం తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా నెట్టింట వైరలవుతోంది. ఈ పోస్ట్‌కు ఆర్‌ఆర్‌ యాజమాన్యం.. RR.. RRRని కలిపినప్పుడు అన్న ఆసక్తికర క్యాప్షన్‌ను పెట్టింది.

కాగా, చహల్‌ కొద్దిరోజుల కిందట RRR మరో ఫేమ్‌ తారక్‌ను కలిశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు చహల్‌తో పాటు టీమిండియా సభ్యులు సూర్యకుమార్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు కూడా తారక్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.

సూర్యకుమార్‌ యాదవ్‌ అయితే అతని భార్య కలిసి తారక్‌తో  ఫోటో దిగాడు. అప్పుడు ఈ ఫోటోలు కూడా నెట్టింట హల్‌చల్‌ చేశాయి. ఇదిలా ఉంటే, టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఆసీస్‌తో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ ఆడుతుండగా.. టెస్ట్‌ జట్టులో స్థానం దక్కని చహల్‌ ఖాళీగా ఉన్నాడు.   

కాగా, 32 ఏళ్ల చహల్ భారత్ తరఫున 72 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 27.13 సగటుతో 121 వికెట్లు పడగొట్టిన చహల్‌.. టీ20ల్లో 24.68 సగటున 91 వికెట్లు సాధించి, భారత్ తరఫున లీడింగ్‌ టీ20 వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు.
 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement