![Devara Hero Jr NTR Interview With Bollywood Producer karan Johar](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/09/10/devara.jpg.webp?itok=u-goBybP)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలవుతోంది.
దీంతో దేవర టీమ్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌తో ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ భేటీకి బాలీవుడ్ భామ ఆలియా భట్ కూడా హాజరైంది. దేవర కా జిగ్రా అంటూ జూనియర్‌తో ముచ్చటించారు ఆలియా, కరణ్ జోహార్. దీనికి సంబంధించిన ఫోటోను దేవర టీమ్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. జిగ్రా పేరుతో తెరకెక్కించిన చిత్రంలో ఆలియా భట్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఓకేసారి రెండు చిత్రాలకు ప్రమోషన్స్ నిర్వంచినట్లైంది. దేవర కోసమే జిగ్రా రిలీజ్ తేదీని వాయిదా వేశారు మేకర్స్.
కాగా.. దేవర ట్రైలర్ ఈ రోజు సాయంత్రమే విడుదల కానుంది. ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర టీమ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. మరికొద్దిసేపట్లోనే దేవర ట్రైలర్ అభిమానులను అలరించనుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్‌చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
#Devara ka #Jigra pic.twitter.com/zxtNLluw9u
— Devara (@DevaraMovie) September 10, 2024
Comments
Please login to add a commentAdd a comment