ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌తో అమిత్ షా భేటీ రద్దు | Amit shah meeting with rrr team is cancelled | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌తో అమిత్ షా భేటీ రద్దు

Published Sat, Apr 22 2023 10:03 PM | Last Updated on Sat, Apr 22 2023 10:42 PM

Amit shah meeting with rrr team is cancelled - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమావేశం చివరి క్షణంలో రద్దయింది. ఈ నెల 23న అమిత్‌ షా తెలంగాణ పర్యటనకు రానున్నట్లు ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నోవాటెల్‌ హోటల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో అమిత్‌ షా సమావేశం కానున్నట్లు కూడా సమాచారం వెల్లడైంది. కానీ ఇప్పుడు ఈ సమావేశం రద్దయినట్లు తెలిసింది.

చివరి క్షణంలో అమిత్ షా టూర్ షెడ్యూల్లో మార్పులు జరగటం వల్ల ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా చేవెళ్ల సభకు వెళ్లనున్నట్లు, ఆ సభ తర్వాత కోర్ కమిటీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో సమావేశం తాత్కాలికంగా రద్దయిందని తెలుస్తోంది. ఆ తరువాత ఈ సమావేశం ఎప్పుడుంటుందనే తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement