సెలవు కాదు శిక్ష‌ణ | Jr NTR Dubai Trip talk of Town | Sakshi
Sakshi News home page

సెలవు కాదు శిక్ష‌ణ

Published Tue, Feb 12 2019 12:32 AM | Last Updated on Tue, Feb 12 2019 12:32 AM

Jr NTR Dubai Trip talk of Town - Sakshi

ఓ వైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రామ్‌చరణ్‌ విలన్లను చితకబాదేస్తున్నారు. ఎన్టీఆర్‌కు ఈ షెడ్యూల్‌లో బ్రేక్‌ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. దాంతో ఎన్టీఆర్‌ దుబాయ్‌కు చిన్న ట్రిప్‌ ప్లాన్‌ చేశారు. షూటింగ్‌ గ్యాప్‌ కదా ఫ్యామిలీ ట్రిప్‌ అనుకుంటే మీరు పొరబడినట్లే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మాత. ఎన్టీఆర్‌ దుబాయ్‌కు వెళ్లింది హాలిడే కోసం కాదు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసమే అని సమాచార. ‘ఈ ట్రిప్‌ వెనక కారణం మాత్రం స్పస్పెన్స్‌. సినిమాలో ప్రేక్షకులకు కచ్చితంగా థ్రిల్‌ ఇవ్వడానికే ఈ ట్రిప్‌’ అని పేర్కొన్నాయి విశ్వసనీయ వర్గాలు. సో.. ఎన్టీఆర్‌ ఫిజిక్‌ మేకోవర్‌ కోసమో లేక కొత్త విద్య నేర్చుకోవడం కోసమో ఈ ట్రిప్‌ అయ్యుంటుందని ఊహించవచ్చు. ఈ నెలాఖరు నుంచి మళ్లీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ జాయిన్‌ అవుతారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్‌ భామలు పరణీతి చోప్రా, ఆలియా భట్‌ పేర్లను పరిశీలిస్తున్నట్టున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. 

అజయ్‌ ఆగయా?
ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్‌ నటుడిని ఎంపిక చేసుకోవాలని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం యోచిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ అక్షయ్‌ కుమార్‌ పేరు వినిపించినా ఫైన ల్‌గా అజయ్‌ దేవగణ్‌కు ఫిక్స్‌ అయ్యారని టాక్‌. మరి కీలక పాత్రంటే విలన్‌ అనుకోవచ్చా? ఎన్టీఆర్, చరణ్‌లు ఫైట్‌ చేసేది అజయ్‌ మీదేనా? 2020 వరకూ వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement