
సాక్షి, హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్నా 'మహర్షి' మూవీకి సంబంధించి ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. హీరో మహేష్‌బాబు ట్విటర్‌లో ఈ వీడియోన్ పోస్ట్ చేశారు. మే 9న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీలోని హీరోయిన్ పూజా హెగ్డే, హీరో మహేష్‌పై చిత్రీకరించిన ‘ఎవరెస్ట్ అంచున’ డ్యూయెట్ సాంగ్ వీడియో ప్రివ్యూ అభిమానులను ఆకట్టుకుంటోంది. చిన్మయి శ్రీపాద, డీఎస్‌పీ ఈ గీతాన్ని ఆలపించారు.
కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ ఆరు మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. జగపతి బాబు, రావు రమేశ్ ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
Enjoy :) #EverestAnchunahttps://t.co/ptzglkWuL8
— Mahesh Babu (@urstrulyMahesh) April 19, 2019
Comments
Please login to add a commentAdd a comment