ఈ వారం యూట్యూబ్ హిట్స్ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Sun, Jul 31 2016 11:19 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఈ వారం యూట్యూబ్ హిట్స్ - Sakshi

ఈ వారం యూట్యూబ్ హిట్స్

కాలా చష్మా: వీడియో సాంగ్
నిడివి : 2 ని. 53 సె. హిట్స్ : 1,74,22,271

బుర్ర ఖరాబ్‌గా ఉంటే రిఫ్రెష్ కొట్టడానికి వెంటనే ఒకసారి యూట్యూబ్‌లోకి వెళ్లండి. ఈవారం పాపులర్స్‌లో కాలా చష్మా సాంగ్‌ని చూడండి. నల్ల కళ్లజోడు పెట్టుకుని కత్రీనా కైఫ్, సిద్ధార్త్ మల్మోత్రా, తక్కిన గుంపు కలిసి పాడే ఈ వీడియో సాంగ్ మిమ్మల్ని మీ సీట్‌లో స్థిమితంగా కూర్చోనివ్వదు. అందుకు ప్రధాన కారణం మ్యూజిక్. ఇంకొక అత్యంత ప్రధానమైన కారణం.. కత్రీనా డాన్స్ చూశాక మీకే తెలుస్తుంది. సెప్టెంబర్ 9న విడుదల కాబోతున్న ‘బార్ బార్ దే ఖో’ చిత్రంలోని ఈ స్పెప్పుల టణ్‌గ్ టణ్‌గ్ సాంగ్ కు మ్యూజిక్‌ని పునఃసృష్టించింది బాద్షా. (ఒరిజినల్ కంపోజింగ్ ప్రేమ్ హర్‌దీప్). అమ్రిక్ సింగ్, కుమార్ కలిసి రాసిన ఈ పాటను అమర్ ఆర్షి బాద్షా, నేహా కక్కర్ తమ స్వరంలోంచి ఒలికించారు. నిత్యా మెహ్రా అనే కొత్త బాలీవుడ్ దర్శకురాలు తీస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉండబోతోందో తెలుసుకోడానికి ‘కాలా చష్మా’ చూస్తే సరిపోతుంది. జీ మ్యూజిక్ కంపెనీ ఈ వీడియోను రిలీజ్ చేసింది. నిత్య గతంలో ‘లైఫ్ ఆఫ్ పై’కి అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశారు.

 

 జాకబ్ సార్టోరియస్: హిట్ ఆర్ మిస్
నిడివి: 4 ని. 18 సె. హిట్స్:  67,61,552

13 ఏళ్ల సోషల్ మీడియా స్టార్.. జాకబ్ సార్టోరియస్.. మ్యూజిక్ లవర్స్‌కి ఇప్పుడొక ఫ్రెష్ లుక్. ‘స్వెట్‌షర్ట్’ తర్వాత ఈ పిడుగు విడుదల చేసిన ఈ ‘హిట్ ఆర్ మిస్’ చూస్తున్నపుడు కనుక మీకు ఇతడి బుగ్గల్ని పట్టి లాగాలన్న ఆలోచన కలిగితే అది మీ దోషం కాదు. పాటలోని ప్రలోభం.‘పెద్దవాళ్లం అయ్యాక జీవితం కష్టంగా ఉంటుందని, ఫన్ అనేది కిడ్స్‌కి మాత్రమే పరిమితం అనీ విన్నాను. కానీ పెరిగి, పెద్దవుతున్న కొద్దీ నాకు తెలుస్తున్నదేమిటంటే.. అలా అని కచ్చితంగా చెప్పలేం’ అంటూ కోరస్‌తో సాంగ్ మొదలవుతుంది. ఈ చిన్నారి అమెరికన్ గాయకుడిలో హాలీవుడ్ నటనకు కావలసిన కళ లన్నీ పుష్కలంగా ఉన్నాయి. ‘లెటజ్ నాట్ వర్రీ అబౌట్ టుమారో’ అని పెద్ద వేదాంతిలా ఇతడు చెప్పడమూ చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. ఒంటి మీద పింక్ షర్ట్, దాని పైన బ్లూ కోటు వేసుకుని, కారులో వెళుతూ పాటకు తగ్గట్టు ఫీలింగ్స్‌ని పాస్ చేస్తుండే జాకబ్‌ని చూస్తుంటే... మెక్సికన్ సింగర జస్టిన్ బీబర్‌కి త్వరలోనే గట్టి పోటీ తగలబోతోందనే అనిపిస్తుంది.

 

ప్రిమిటివ్ టెక్నాలజీ: ఫోర్జ్ బ్లోయర్
నిడివి : 4 ని. 31 సె. హిట్స్ : 36,15,316
నెట్‌లో ‘ప్రిమిటివ్ టెక్నాలజీ.వర్డ్‌ప్రెస్’ అనే సైట్ ఉంటుంది. అందులోకి వెళ్లి చూస్తే అంద మైన ఆదిమానవ  లోకంలోకి వెళ్లినట్లే. ఇప్పటి టెక్నాలజీ అంతా అప్పటి ఐడియాల పుణ్యమే కాబట్టి.. సైట్ చూడ్డానికి ఇంట్రెస్టుగా ఉంటుంది. ఎలా బతికాం? ఎలా బతుకుతున్నాం అని తెలుస్తుంది. బతికి ఉన్న కాలమే బెటర్‌గా ఉంది, బతుకుతూ ఉన్న కాలం కంగాళీగా ఉంది అని కూడా అనిపించవచ్చు. ఈ సైట్ నిర్వాహకులు రెండు రోజుల క్రితం ‘ఫోర్జ్ బ్లోయర్’ (కొలిమి) ప్రాథమిక రూపాన్ని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేశారు. అడవిలో నిప్పుని సృష్టించే ఈ వీడియో.. మిమ్మల్ని కూడా ఇలాంటి ఒక ప్రయోగానికి ప్రేరేపించినా ఆశ్చర్యం లేదు. అంత టెంప్టింగ్‌గా ఉంది. వీడియో అర్థం కాకపోతే... కింద టెక్స్ట్‌ను బట్టి విషయాన్ని ఫాలో అవొచ్చు.

 

కాన్యే వెస్ట్-ఉల్ఫ్స్ (బాల్‌మైన్ కాంపెయిన్)
నిడివి : 7 ని. హిట్స్ : 32,52,503

కాన్యే వెస్ట్ అమెరికన్ సింగర్. సాంగ్ రైటర్. ఆయన తాజాగా విడుదల చేసిన వీడియో సాంగ్ ఉల్ఫ్స్. రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లోకి వచ్చింది. ఫ్రెంచి ఫ్యాషన్ కంపెనీ బాల్‌మెయిన్ కోసం ఆయన ఈ వీడియోను రూపొందించారు. కాన్యేకి ఏమిటి సంబంధం? ఆయన సుప్రసిద్ధ డిజైనర్ కూడా. ఇక వీడియోలోని విశేషాలు. కొంచెం కిక్క్ కోరుకునేవారు ఒంటరిగా, గది తలుపులు వేసుకుని ఈ మ్యూజిక్ వీడియోను చూడొచ్చు. విన్నా చాలు.. వణుకులోంచి సన్నగా వెన్ను... సారీ, వెన్నులోంచి సన్నగా వణుకు మొదలవుతుంది. కొన్ని నిమిషాలయ్యాక కన్నీళ్లూ వచ్చేస్తాయి. భయంతో కాదు. ఎమోషన్‌తో. ‘యు టర్న్‌డ్ అవుట్. యూ టూ వైల్డ్’ అని కాన్యే కళ్లు ధారగా వర్షిస్తుంటాయి. ఈ బ్లాక్ అండ్ వైట్‌లో మీకు లైఫ్‌లోని చాలా కలర్స్ కనిపిస్తాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement