చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న సినిమా జార్జ్‌రెడ్డి. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి.. ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి ఉద్యమ నాయకుడి గురించి ఈ తరం తెలుసుకునేలా రూపొందిస్తున్న సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) .
తాజాగా ఈ సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించగా.. మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందిచారు. తాజాగా ఈ పాట ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ మారింది. నెటిజన్లను ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది. దసరా సందర్భంగా చిత్ర యూనిట్ ‘జార్జ్ రెడ్డి’ ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
చిత్రం పోస్టర్‌ను మంగళవారం నందికొట్కూర్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఆవిష్కరించారు. దీంతో ‘జార్జ్ రెడ్డి’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పేరుగుతున్నాయి. ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి కెమెరా: సుధాకర్ యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్: దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment