
బిగ్‌బాస్ బ్యూటీ దివి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తన హాట్ హాట్ అందాల ఫొటోషూట్‌లను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా దివి ఓ ఫోక్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సాంగ్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో బయటకు వచ్చింది.
దివి లంగాఓణి, ఫుల్ జ్యూవెల్లరి, ముక్కపుడకతో పాటకు చిందేలిసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. విడుదలైన 2 గంటల్లోనే ఈ పాట 44 వేలకు పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది. ‘సిలక ముక్కుదానా.. అని ముద్దుగా పిలుస్తాడే’ అంటూ తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ పాటకు దివి మాస్ స్టేప్పులతో ఇరగదీసింది. కాసర్ల శ్యాం లిరిక్స్ రాసిన ఈ పాటను గాయనీ హారిక నారాయణ్ ఆలపిచింది. శేఖర్ మాస్టర్ దర్శకత్వం, కొరియోగ్రఫీ అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment