Case Filed On Actress Urfi Javed Over Her Outfit Look In Latest Video Song - Sakshi
Sakshi News home page

Urfi Javed: రెడ్‌ కలర్‌ శారీలో రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్‌.. తీవ్ర వ్యతిరేకత.. కేసు నమోదు

Published Wed, Oct 26 2022 1:04 PM | Last Updated on Wed, Oct 26 2022 1:40 PM

Case Filed On Actress Urfi Javed Over Her Latest Video Song - Sakshi

సోషల్‌ మీడియా సెన్సేషన్‌, హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ ఫేం ఉర్ఫీ జావేద్‌ తన తీరుతో మరోసారి వివాదంలో నిలిచింది. తాజాగా ఆమె నటించిన ఓ అల్బమ్‌ సాంగ్‌పై పలు సామాజిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ పాటలో ఉర్ఫీ చీరకట్టు, డాన్స్‌పై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు న్యూఢిల్లీ పోలీస్‌ స్టేషన్‌లో అక్టోబర్‌ 23న ఆమెపై ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ వీడియోలో ఉర్ఫీ తీరు లైంగిక చర్యలను ప్రోత్సహించేలా ఉందంటూ సదరు ఫిర్యాదు దారుడు పేర్కొన్నారు.

చదవండి: పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా? 

కాగా ఉర్పీ జావేద్‌ నటించిన ‘హాయే హాయే యే మజ్‌బూరీ’ అనే అల్భమ్‌ సాంగ్‌ అక్టోబర్‌ 11న రిలీజ్‌ అయ్యింది. ఇందులో ఆమె రెడ్‌ కలర్‌ చీర కట్టులో కనిపించింది. ఉర్ఫీ విభిన్న వస్త్రాధారణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రవిచిత్రమైన డ్రెస్సింగ్‌తో ఆమె తరచూ ట్రోల్స్‌ బారిన పడుతుంది. తాజాగా ఈ పాటలో సైతం ఆమె చీరకట్టులో ఫుల్‌ గ్లామర్‌ షో చేసింది. దీంతో ఉర్పీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియోలో ఆమె డ్రెస్సింగ్‌, డాన్స్‌ తీరు లైంగిక పరంగా రెచ్చగొట్టెలా ఉందంటూ పలువురి నుంచి వాదనలు వినిపిస్తున్నాయి.

చదవండి: ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి

ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో తనపై వచ్చే నెగిటివిటిపై గతంలో ఉర్ఫీ జావేద్‌ స్పందిస్తూ ఇవేవి తనని బాధించలేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సైతం స్పందిస్తూ తన డ్రెస్సెంగ్‌, ఫ్యాషన్‌ పట్ల చాలా గర్వంగా ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ ట్రోల్స్‌ నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. నా ఫ్యాషన్‌ తీరు పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. విమర్శలు, వివాదాలు నన్ను ఆపలేవు. ఎందుకంటే నేను ఏం చేసినా, ఏం పోస్ట్‌ చేసిన దాన్ని అందరు పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూనే ఉంటారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement