Bigg Boss Urfi Javed Reveals About Her Failed Lips Treatment, Shocking Pics Of Her Lips Goes Viral - Sakshi
Sakshi News home page

Urfi Javed Failed Lip Surgery Photos: 18వ ఏట నుంచే ట్రీట్‌మెంట్‌.. పెదాలు పెద్దగా చేసేందుకు ఫిల్లర్స్‌.. ఆపేస్తే చాలా ప్రమాదం!

Jul 24 2023 3:54 PM | Updated on Jul 24 2023 4:07 PM

Urfi Javed Reveals About Her Failed Lips Treatment, Shocking Pics Of Her Goes Viral - Sakshi

నా పెదాలు చాలా సన్నగా ఉండటంతో దాన్ని ఎలాగైనా సరే లావుగా కనబడేలా చేయాలనుకున్నాను. ఓ వైద్యుడి దగ్గరకు వెళ్తే తక్కు

సోషల్‌ మీడియా వాడేవారికి బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి ఉర్ఫీ జావెద్‌ సుపరిచితమే! చిత్రవిచిత్ర వేషధారణతో వార్తల్లోకెక్కే ఈ బ్యూటీ ఓ సర్జరీ వల్ల తన ముఖం ఎంత అందవిహీనంగా మారిందో చెప్పుకొచ్చింది. పెదాలు అందంగా కనిపించేందుకు లిప్‌ ఫిల్లర్‌ సర్జరీ చేయించుకున్న ఆమె అవి తన ముఖారవిందాన్ని పాడు చేశాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. సర్జరీ వికటించడంతో తన పరిస్థితి ఎలా తయారైందనేది చెప్పుకొచ్చింది.

'పెదాల కోసం చేసుకున్న సర్జరీ ప్రయాణాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.. 18 ఏళ్ల వయసు నుంచి లిప్‌ ఫిల్లర్‌ సర్జరీ చేయించుకుంటున్నాను. అప్పుడు నా దగ్గర ఎక్కువగా డబ్బులుండేవి కావు. కానీ నా పెదాలు చాలా సన్నగా ఉండటంతో దాన్ని ఎలాగైనా సరే లావుగా కనబడేలా చేయాలనుకున్నాను. ఓ వైద్యుడి దగ్గరకు వెళ్తే తక్కువ ఖర్చుతో చేసేస్తా అన్నాడు. కానీ ఫలితం.. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలా తయారైంది. కొంతకాలానికి వీటిని ఆపేయాల్సి వచ్చింది. అది చాలా ప్రమాదకరం, దాని పరిణామాలు ఎంతో బాధాకారంగా ఉంటాయి. మీరు ఇలా చేయించుకోవద్దని చెప్పడం లేదు. కానీ ఫిల్లర్స్‌, బొటాక్స్‌ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా.

ఇప్పటికీ నేను లిప్‌ ఫిల్లర్స్‌ వాడుతున్నాను. నా ముఖానికి ఏది సరిపోతుంది? ఏది ఎంత మోతాదులో సూటవుతుందనేది నాకిప్పుడు బాగా తెలుసు. మీరెవరైనా డాక్టర్‌ దగ్గరకు వెళ్లేముందు అన్నింటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ ముఖం బాగోలేదని, మీ శరీరాకృతి సరిగా లేదని మిమ్మల్ని మీరు ద్వేషించుకునే బదులు ఇలాంటి ఫిల్లర్స్‌, సర్జరీ ఎంచుకోవడమే మంచిదని చెప్తాను. కాకపోతే మంచి డాక్టర్‌ దగ్గర మాత్రమే ట్రీట్‌మెంట్‌ తీసుకోండి' అని రాసుకొచ్చింది ఉర్ఫీ జావెద్‌.

చదవండి: చంద్రముఖి 2 ప్రాణభయం.. నిద్రలేని రాత్రులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement