దేవర ఆయుధ పూజ.. ఫుల్ వీడియో వచ్చేసింది! | Jr Ntr Devara Crazy Song Ayudha Pooja Full Video Out Now | Sakshi
Sakshi News home page

Devara Movie: ఆయుధ పూజ సాంగ్.. ఫుల్ వీడియో చూసేయండి!

Published Tue, Oct 22 2024 4:54 PM | Last Updated on Tue, Oct 22 2024 5:11 PM

Jr Ntr Devara Crazy Song Ayudha Pooja Full Video Out Now

జూనియర్ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబోలో వచ్చిన ఫుల్ యాక్షన్‌ మూవీ దేవర పార్ట్-1. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది. ఎన్టీఆర్‌ సరసన తనదైన నటన, డ్యాన్స్‌తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం దేవర విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.

అయితే తాజాగా దేవర టీమ్ ఆయుధ పూజ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట ఫుల్ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్‌లో వ్యూస్‌పరంగా దూసుకెళ్తోంది. ఇంకేందుకు ఆలస్యం ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ పార్ట్‌-2 కూడా ఉందని దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement