Tamannaah Bhatia Reacts To Viral Video Of Kid Dancing To Kaavaalaa From Jailer - Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: జైలర్ సాంగ్‌కు బేబీ స్టెప్పులు.. ఫిదా అయిన మిల్కీ బ్యూటీ!

Published Sat, Jul 8 2023 6:55 PM | Last Updated on Sat, Jul 8 2023 7:07 PM

A Cute Baby DanceTamannaah Bhatia Jailor Song Kavaalaa Video Song - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే లస్ట్ స్టోరీస్‌-2 వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చిరంజీవి సరసన భోళాశంకర్‌, మరోవైపు తమిళ స్టార్ రజనీకాంత్ జంటగా జైలర్‌లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నువ్వు 'కావాలా' అనే లిరికల్ సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్. 

(ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్‌ వస్తుంది: మాళవిక)

అయితే ఈ సాంగ్‌లో తమన్నా తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టింది. తాజాగా ఈ వీడియో సాంగ్‌ను చూసిన ఓ చిన్నారి స్టెప్పులతో అదరగొట్టింది.  టీవీలో సాంగ్ చూస్తూ స్టెప్పులకు తగినట్లుగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా.. తమన్నా సైతం అభినందించకుండా ఉండలేకపోయింది. ఈ క్యూట్‌ బేబీ కూడా పోటీకీ వస్తుందని ఊహించలేదంటూ ఆ ట్వీట్‌ రిప్లై కూడా ఇచ్చింది మిల్కీ బ్యూటీ. ఇది చూసిన కొందరు సినీ ప్రియులు చిన్నారిని అభినందిస్తున్నారు. కాగా.. తమన్నా, రజనీకాంత్ నటించిన జైలర్ ఆగస్టు నెలలో రిలీజ్ కానుంది. 

(ఇది చదవండి: స్టార్‌ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement