
Rakul Preet Singh Comments On Mashooka Video Song: అతికొద్ది సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన ఈ పంజాబీ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే తెలుగు ప్రేక్షకులను పలకరించి మాత్రం ఏడాది కావొస్తోంది. రకుల్ చివరిగా వైష్ణవ్ తేజ్‌కు జోడిగా 'కొండపొలం' చిత్రంతో అలరించింది. అయితే ఇటీవల సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు షార్ట్ డ్యాన్స్ వీడియోస్ అప్‌లోడ్ చేసి ఆకట్టుకుంది ఈ ఫిట్‌నెస్ భామ. అయితే తాజాగా మషూక అనే మ్యూజిక్ వీడియో చేసింది రకుల్.
ఈ మ్యూజిక్ సింగిల్‌లో అల్ట్రా గ్లామరస్‌గా కనిపించి, డ్యాన్స్‌తో ఫిదా చేసింది. ఈ మ్యూజిక్ వీడియో గురించి ఒక ఛానెల్‌తో శనివారం (ఆగస్టు 6) ప్రత్యేకంగా మాట్లాడింది. 'మొదటగా ఈ పాటను హిందీ పాప్ సాంగ్‌గానే రూపొందించాలనుకున్నా. కానీ, నాకు స్టార్‌డమ్ కట్టబెట్టిన తెలుగు, తమిళ ప్రేక్షకుల కోసం ఆ రెండు భాషల్లోనూ రూపొందించి పాన్ ఇండియా సింగిల్‌గా తీర్చిదిద్దాం. తెలుగు, తమిళ పరిశ్రమపై నాకున్న ప్రేమను తెలియజేసేందుకు ఇదో అవకాశంగా ఉపయోగించుకున్నా' అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. కాగా ఈ వీడియో సాంగ్‌ను రకుల్ బాయ్‌ఫ్రెండ్, నిర్మాత జక్కీ భగ్నానీతో కలిసి రూపొందించడం విశేషం.
చదవండి: బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే!
ఆ హీరోతో జోడి కట్టనున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె
Comments
Please login to add a commentAdd a comment