సినిమాలే కాదు.. జీవితంలో కష్టసుఖాలు కూడా పంచుకున్నాం: ఎన్టీఆర్‌ | Jr NTR Comments On Devara Success Meet | Sakshi
Sakshi News home page

Jr NTR: మరో జన్మలోనైనా మీ రుణం తీర్చుకుంటా: ఎన్టీఆర్ ఎమోషనల్

Published Fri, Oct 4 2024 6:11 PM | Last Updated on Fri, Oct 4 2024 6:40 PM

Jr NTR Comments On Devara Success Meet

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటేడ్‌ చిత్రం దేవర పార్ట్‌-1. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలివారంలో ఏకంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో దేవర చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్‌కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్‌ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ..'ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నా. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు దేవర విజయం వెనుక డైరెక్టర్స్‌, సాంకేతిక నిపుణులు, తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు ముఖ్యమైంది నా అభిమానులే. ఏ జన్మలో చేసుకున్న రుణమో కానీ.. మీతో అలాంటి బంధం ఏర్పడింది. ఎల్లప్పుడు నాకు అండగా నిలుస్తున్న ప్రతి అభిమానికి నా పాదాభివందనాలు. మరో జన్మలోనైనా మీ రుణం తీర్చుకుంటా.' అంటూ ఎమోషనల్ అయ్యారు. చిత్రబృందం సమష్టి కృషితో దేవర మూవీ భారీ విజయం దక్కిందని తెలిపారు.

(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దేవర.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?)

అంతేకాకుండా ఈ చిత్రానికి అనిరుధ్ అద్భుతమైన సంగీతం, బీజీఎం అందించారని ప్రశంసలు కురిపించారు. నా తండ్రి తర్వాత ఆ ప్లేస్‌లో ఉండి నన్ను నడిపిస్తున్న కల్యాణ్ రామ్ అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కొరటాల శివ అన్నతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు.. బృందావనం నుంచి మా రిలేషన్ మొదలైంది. కేవలం సినిమాలే కాదు.. జీవితంలో కష్టసుఖాలు కూడా పంచుకున్నాం.. ఒక దర్శకుడిగా కాదు.. సోదరుడిగా నాకు సపోర్ట్‌గా నిలిచారని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారో నాకు తెలుసన్నారు. ఈ విజయం కొరటాల శివ అన్నకు మనశ్శాంతిని కలిగించిందని ఎన్టీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement