డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్)లో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
‘మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమే, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో, సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమో మాదక ద్రవ్యాలపై ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే విలువైనది. రండి.. నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111 సమాచారం అందించండి ’అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
(చదవండి: ‘ఆచార్య’ ఫలితం తర్వాత చిరంజీవీ మెసేజ్ చేశాడు...‘దేవర’ మార్పులు చేశా: కొరటాల)
కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్‌లో రేవంత్ మట్లాడుతూ.. ఇకపై ఎవరికైనా సరే టకెట్ రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కూడా దేవర సినిమా రిలీజ్‌కి రెండు రోజుల ముందుకు అలా వీడియో చేసి పంపారు.
ఇక దేవర విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ ప్లే చేశాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment