నీటిలో డిష్యుం డిష్యుం | Jr NTR Underwater Fight Scene in Devara Movie | Sakshi
Sakshi News home page

నీటిలో డిష్యుం డిష్యుం

Published Mon, Sep 4 2023 12:42 AM | Last Updated on Mon, Sep 4 2023 12:42 AM

Jr NTR Underwater Fight Scene in Devara Movie - Sakshi

‘జనతా గ్యారేజ్‌’ (2016) వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్‌–డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘దేవర’. ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. అందులో భాగంగా ఇప్పటికే తొలి షెడ్యూల్‌లో షిప్‌లో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు కొరటాల శివ. తాజాగా ‘దేవర’లో కీలకంగా ఉండే మరో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ని ఆరంభించారని టాక్‌. పూర్తిగా నీటిలో సాగే ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని భోగట్టా.

దాదాపు 20 రోజుల పాటు ఈ ఫైట్‌ని చిత్రీకరించనున్నారట మేకర్స్‌. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ అద్భుతంగా వచ్చేందుకు ఎన్టీఆర్‌ మూడు రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట. ఫైట్‌ మాస్టర్‌ కింగ్‌ సోలొమన్‌ ఈ సీక్వెన్స్‌ని డిజైన్‌ చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ద్వారా నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్ర చేస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement