NTR 30 Official Launch: Jr NTR And Janhvi Kapoor Movie Launched With Grand Puja Ceremony In Hyderabad, SS Rajamouli And Others Attend, Pics Viral - Sakshi
Sakshi News home page

Jr NTR-NTR30: జూనియర్‌తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్‌

Published Thu, Mar 23 2023 10:56 AM | Last Updated on Thu, Mar 23 2023 1:17 PM

NTR30: Finally Jr NTR, Koratala Siva Movie Starts in Hyderabad - Sakshi

నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్‌ అంతా ఎదురు చూస్తున్నా ఆ సమయం వచ్చేసింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 30వ చిత్రం నేడు ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NTR30 గురువారం(మార్చి 23న) హైదరాబాద్‌లో ఐటీసీ కొహినూర్‌లో వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు. పూజ అనంతరం జక్కన్న ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ల ముహుర్తపు తొలి సన్నివేశానికి క్లాప్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. దీంతో ఎంతో కాలంగా సస్సెన్స్‌లో ఉన్న ఈ మూవీ హీరోయిన్‌పై తాజాగా క్లారిటీ వచ్చేసింది.

చదవండి: ఎట్టకేలకు దిగొచ్చిన రష్మిక.. ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్‌..

NTR30లో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా ఫైనల్‌ అయ్యింది. ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూవీ టీంతో మాటలు కలుపుతూ సరదగా గడిపింది. తన అభిమాన నటుడు, కో-స్టార్‌ ఎన్టీఆర్‌ని కలిసిన సమయంలో ఆమె ఆనందంతో మురిసిపోయింది. ఎన్టీఆర్‌ ఆమె పలకరించగా ఆనందంతో ఆమె ముఖం మెరిసిపోయిన ఫొటో నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది. కాగా త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. కాగా ఎన్టీఆర్‌ 30ని వచ్చే ఏడాది 2024 ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు తమిళ యంగ్‌ మ్యూజిక్‌ సన్సెషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించనున్నాడు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement