యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్30 (NTR30) మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో ఈ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాను ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సెట్‌పైకి రాలేదు.
చదవండి: పట్టలేని సంతోషంతో భార్యను హగ్ చేసుకున్న అభిషేక్.. ఆ రూమర్లకు ఈ వీడియోతో చెక్
దీంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఇటివలె ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రీప్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పట్లో ఎన్టీఆర్ 30 మూవీ సెట్స్ రానట్లేనా? అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఆ ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం కొత్త సంవత్సరంలోనే ఈ మూవీ సెట్స్‌పైకి రానుందని తెలుస్తోంది.
చదవండి: ఆ నిర్మాతను కలిసిన నటి.. వార్నింగ్ ఇచ్చిన సింగర్ చిన్మయి
ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక సంక్రాంతికి కుదిరిందనీ, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం చిత్ర బృందం ప్రీప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్‌లో ఉన్న తారక్ న్యూఇయర్ వేడుకలను అక్కడే జరుపుకొనున్నాడట. జూ. ఎన్టీఆర్ వచ్చాకా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. ఈ చిత్రానికి తమిళ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment