RRR Hero Jr NTR Begins Prep for Devara in Gym - Sakshi
Sakshi News home page

Jr NTR Devara: వేకేషన్‌లో ఉన్నా కూడా తగ్గేదేలే.. ఎన్టీఆర్ ఫోటో వైరల్

Published Mon, May 29 2023 6:53 PM | Last Updated on Mon, May 29 2023 7:11 PM

Jr NTR begins prep for Devara in gym Workout sessions on vacation - Sakshi

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీర్, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'దేవర'. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్‌ విలన్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ ఎంత చెమడ్చుతున్నారో ఈ పిక్ చూస్తే అర్థమవుతోంది. 

ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్‌ షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జిమ్‌లో ఎన్టీఆర్ కష్టపడుతున్న ఈ ఫోటోను చూస్తే పని పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాడో అర్థమవుతోంది.  'దేవర ఏట్ వర్క్.. ఎక్కడైనా సరే అంకితభావం ముందు ఏదీ అడ్డురాదు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. షూటింగ్‌కు కొన్ని రోజులు గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి వేకేషన్ వెళ్లారు మన జూనియర్ టైగర్. వేకేషన్‌లో కూడా ఎన్టీఆర్ డెడికేషన్ అంటే ఇదీ అంటూ అభినందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement