
తారక్ భుజం నొప్పితో బాధపడుతున్నాడని, అతడు కనీసం నాలుగు వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో ఆయన తర్వాతి సినిమాల మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఎన్టీఆర్ అనారోగ్యం బారిన పడ్డాడని, దీంతో ఈ సినిమా షూటింగ్ కొంతకాలం వాయిదా పడనుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తారక్ భుజం నొప్పితో బాధపడుతున్నాడని, అతడు కనీసం నాలుగు వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడట. ముందైతే కొరటాల శివను పక్కా సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. అప్పటివరకు తన ఫ్యామిలీతో కలిసి హాలీడే టూర్‌ను ఎంజాయ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు తారక్. కాగా ఎన్టీఆర్30గా రూపొందే ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణలు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
చదవండి: పదునైన ఆయుధంతో సూసైడ్ అటెంప్ట్, ఫేస్‌బుక్‌లో వీడియో
సోనమ్.. నీ ఫ్రెండ్స్ ఎంతమందితో అతడు బెడ్ షేర్ చేసుకున్నాడు?