భారీ ధరకు ‘దేవర’ ఓవర్సీస్‌ రైట్స్‌.. ఎన్టీఆర్‌కి పెద్ద భారమే! | Devara Overseas Rights Sold For Huge Amount | Sakshi
Sakshi News home page

భారీ ధరకు ‘దేవర’ ఓవర్సీస్‌ రైట్స్‌.. ఎన్ని కోట్లంటే..?

Published Sun, Jan 28 2024 8:57 AM | Last Updated on Sun, Jan 28 2024 11:29 AM

Devra OVerseas Rights Sold For Huge Amount - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజ్‌’తర్వాత ఎన్టీఆర్‌తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది.  జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు.  రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ  పాన్‌ ఇండియా సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం ఈ ఏడాది ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ గతంలో పేర్కొంది. కానీ వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌ మాత్రం అప్పుడే మొదలైంది.

(చదవండి: స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుందా?)

తాజాగా ఓవర్సీస్‌ డీల్‌ పూర్తయినట్లు సమాచారం. రూ.27 కోట్లకు ఓవర్సీస్‌ రైట్స్‌ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌, కొరటాల కాంబినేషన్‌ సినిమాగా చూసుకుంటే ఇది పెద్ద డీల్‌ అనే చెప్పొచ్చు. ఈ మూవీ సేఫ్‌ జోన్‌లోకి వెళ్లాలంటే అక్కడ ఏకంగా 5.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాలి. ఇది పెద్ద భారమే. ఎన్టీఆర్‌ ఎన్టీఆర్ చివరి సినిమా అరవింద సమేత ఓవర్సీస్ లో రెండున్నర మిలియన్ డాలర్ల దాకా కలెక్షన్లు తెచ్చుకుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఇమేజ్‌ పెరిగినప్పటికీ.. 5.5 మిలియన్‌ డాలర్ల కలెక్షన్స్‌ అంటే చాలా కష్టమే. అయితే సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ వస్తే మాత్రం టార్గెట్‌ రీచ్‌ కావడం పెద్ద కష్టమేమి కాదని సినీ పండితులు అంటున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో దేవరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  అదే స్థాయిలో సినిమా హిట్‌ అయితే మాత్రం ఓవర్సీస్‌లో ఎన్టీఆర్‌ రికార్డు సృష్టించడం ఖాయం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement