Overseas release
-
భారీ ధరకు ‘దేవర’ ఓవర్సీస్ రైట్స్.. ఎన్టీఆర్‌కి పెద్ద భారమే!
ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’తర్వాత ఎన్టీఆర్‌తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలో పేర్కొంది. కానీ వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మాత్రం అప్పుడే మొదలైంది. (చదవండి: స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుందా?) తాజాగా ఓవర్సీస్ డీల్ పూర్తయినట్లు సమాచారం. రూ.27 కోట్లకు ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ సినిమాగా చూసుకుంటే ఇది పెద్ద డీల్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే అక్కడ ఏకంగా 5.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాలి. ఇది పెద్ద భారమే. ఎన్టీఆర్ ఎన్టీఆర్ చివరి సినిమా అరవింద సమేత ఓవర్సీస్ లో రెండున్నర మిలియన్ డాలర్ల దాకా కలెక్షన్లు తెచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగినప్పటికీ.. 5.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ అంటే చాలా కష్టమే. అయితే సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం టార్గెట్ రీచ్ కావడం పెద్ద కష్టమేమి కాదని సినీ పండితులు అంటున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో దేవరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే స్థాయిలో సినిమా హిట్ అయితే మాత్రం ఓవర్సీస్లో ఎన్టీఆర్ రికార్డు సృష్టించడం ఖాయం. -
లైకా ప్రొడక్షన్స్ మరో భారీ డీల్.. ఆ సినిమా హక్కులు సొంతం!
కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో నటి మాళవిక మోహన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాతర కార్యక్రమాలను ముమ్మరంగా జరుపుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో ధనుష్ గెటప్ చాలా భిన్నంగా ఉండడం.. ట్రైలర్ ఇటీవలే విడుదలై విశేష స్పందన పొందడంతో కెప్టెన్ మిల్లర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా త్వరలో ఆడియో రిలీజ్‌తో పాటు మరిన్నీ విషయాలను చిత్ర నిర్మాతలు వెల్లడించనున్నట్లు సమాచారం. అదే విధంగా కెప్టెన్ మిల్లర్ చిత్రంపై వ్యాపార వర్గాల్లో చాలా క్రేజ్ ఉంది. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ విడుదల హక్కులను లైకా ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. లైకా ప్రొడక్షన్స్ పలు భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. మరో పక్క ఇతర చిత్రాలను సైతం విడుదల చేస్తోంది. అలా ఇటీవల అజిత్ హీరోగా నటించిన తుణివు(తెగింపు) చిత్రాన్ని విదేశాలలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసింది. తాజాగా ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్ర విదేశీ విడుదల హక్కులను పొందడం మరో విశేషం. ఈ విషయాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ మంగళవారం అధికారికంగా మీడియాకు వెల్లడించింది. This December 15, is gonna be blast 💥 in theatres! We are happy in acquiring the OVERSEAS THEATRICAL RIGHTS 🌍📽️ of #CaptainMiller 🪃 Captain Miller Overseas release by @LycaProductions Subaskaran 🤗✨@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash… pic.twitter.com/7JtDzXLANm — Lyca Productions (@LycaProductions) September 26, 2023 -
ఆల్‌టైం రికార్డ్ దిశగా ‘భరత్ అనే నేను’
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ అవుతోంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ఓవర్ సీస్ రిలీజ్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఓవర్సీస్ లో మహేష్ కు మంచి మార్కెట్ ఉంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఫ్లాప్ సినిమాలు కూడా అక్కడ మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించాయి. అందుకే భరత్ అనే నేను సినిమాను అక్కడ మరింత భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 19న దాదాపు 2000 ప్రీమియర్ షోస్ వేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. గతంలో ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో ప్రీమియర్స్ షోస్ ను వేయలేదు. దీంతో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నారు. శనివారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఓవర్సీస్లో భారీగా 'ఆనందో బ్రహ్మా'
తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కి.. తొలి ట్రైలర్ నుంచి సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన కామెడీ హర్రర్ మూవీ ఆనందో బ్రహ్మా. నిర్మాత విజయ్ చల్లా తో పాటు డల్లాస్ కు చెందిన ఎన్నారై శశి దేవిరెడ్డి సయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షో బుకింగ్స్ లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. 70ఎమ్ ఎమ్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రీమియర్స్ ఆగస్టు 17న ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నిర్వాణ సినిమాస్ సంస్థ ఆగస్టు 18న రిలీజ్ చేస్తోంది. మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పెద్ద సంఖ్యలో థిటయేర్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్, శకలక శంకర్, రాజీవ్ కనకాలలు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.