ఓవర్సీస్లో భారీగా 'ఆనందో బ్రహ్మా' | taapsee Anando Bramha Release details | Sakshi
Sakshi News home page

ఓవర్సీస్లో భారీగా 'ఆనందో బ్రహ్మా'

Published Thu, Aug 17 2017 1:33 PM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM

ఓవర్సీస్లో భారీగా 'ఆనందో బ్రహ్మా'

ఓవర్సీస్లో భారీగా 'ఆనందో బ్రహ్మా'

తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కి.. తొలి ట్రైలర్ నుంచి సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన కామెడీ హర్రర్ మూవీ ఆనందో బ్రహ్మా. నిర్మాత విజయ్ చల్లా తో పాటు డల్లాస్ కు చెందిన ఎన్నారై శశి దేవిరెడ్డి సయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షో బుకింగ్స్ లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. 70ఎమ్ ఎమ్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రీమియర్స్ ఆగస్టు 17న ప్రదర్శించనున్నారు.

ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నిర్వాణ సినిమాస్ సంస్థ ఆగస్టు 18న రిలీజ్ చేస్తోంది. మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పెద్ద సంఖ్యలో థిటయేర్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్, శకలక శంకర్, రాజీవ్ కనకాలలు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement