
‘జనతా గ్యారేజ్’ (2016) చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు.
ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఈ నెల 23న జరపనున్నట్లు శనివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో కోర్టు సెట్‌ను రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Storm alert ⚠️#NTR30 Muhurtam on March 23rd 💥💥@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/hD7O9Kh675
— NTR Arts (@NTRArtsOfficial) March 18, 2023
Comments
Please login to add a commentAdd a comment