
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన ‘నా వ్యక్తిగత విషయాలను, నేను తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా ప్రతి అప్‌డేట్ అందిస్తూ ప్రేక్షకులకు చేరువలోనే ఉంటాను. మీడియా చానళ్లు, పత్రికల ద్వారా మనం కలుస్తూనే ఉంటాం. దీనివల్ల మీడియం మారిందే తప్ప మన మధ్య బంధంలో మార్పు ఉండదు’ అంటూ కొరటాల ట్వీట్ చేశాడు.
— koratala siva (@sivakoratala) June 25, 2021
ఇక డైరెక్టర్‌గా కూడా తర్వలోనే రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్లు ఇటీవల కొరటాల బర్త్‌డే సందర్భంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికే ముందే తన రిటైర్‌మెంట్‌కు ప్లాన్ చేసుకున్నానని, తన డైరెక్షన్‌లో పది సినిమాలు చేసిన అనంతరం దర్శకుడిగా సినిమాలకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా సెటిలైయిపోతానంటూ ఆయన ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచినట్లు వచ్చిన ఈ న్యూస్ సినీ ప్రేక్షకులు, ఆయన ఫాలోవర్స్ అంతా షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నట్లు ప్రకటించడంతో.. నెటిజన్లు ఆయనకు ఏమైంది ఇలా చేస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహలు చేస్తున్నాడు.
చదవండి:
అప్పుడే డైరెక్టర్‌గా రిటైర్‌మెంట్ ప్రకటించిన కొరటాల శివ!