కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన విజయ్‌.. కారణం ఇదేనట | Vijay Devarakonda Rejects Koratala Siva Project | Sakshi
Sakshi News home page

కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన విజయ్‌.. కారణం ఇదేనట

Published Sat, Apr 24 2021 9:06 PM | Last Updated on Sat, Apr 24 2021 10:03 PM

Vijay Devarakonda Rejects Koratala Siva Project - Sakshi

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి మంచి సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులు అందిచండంతో సిద్ధహస్తుడు దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్‌ ‘మిర్చి’ మొదలు మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’వరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో ఓ స్ట్రాంగ్‌ సోషల్‌ మెసేజ్‌ ఉంటుంది. ప్రస్తుతం ఆయన మెగాస్టార్‌ చిరంజీవితో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కొరటాల శివ ఆఫర్‌ని రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తిరస్కరించాడనే వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తన స్నేహితుని కోసం ఓ సినిమా చేయమని అడిగితే విజయ్‌ దేవరకొండ నో చెప్పారట.

వివరాల్లోకి వెళితే.. యువ సుధా ఆర్ట్స్ అధినేత మిక్కిలినేని సుధాకర్‌, కొరటాల శివ మధ్య మంచి అనుబంధం ఉంది. కొరటాల శివ సక్సెస్‌ బాటలో దూసుకెళ్లడంతో ఆయన అండతో సుధాకర్‌ నిర్మాతగా నిలదొక్కుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన టాలీవుడ్‌లో చాలా సినిమాలు నిర్మిస్తున్నాడు. భవిష్యత్తులో కొరటాల తీయబోయే సినిమాలను యువ సుధా ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా.. కొరటాల శివ టాప్‌ డైరెక్టర్‌గా కొనసాతున్నప్పుడే తన నిర్మాణ సంస్థను మరింత బలంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నాడట సుధాకర్‌.

కొరటాల కూడా తన స్నేహితుడి బ్యానర్‌ కోసం కొత్త ప్రాజెక్టులను సెట్‌ చేయాలని చూస్తున్నాడట. అందులో భాగంగా యువసుధ ఆర్ట్స్, యువ దర్శకుడు వెంకి కుడుముల కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ ను సెట్ చేశాడట. దీని కోసం రౌడీ హీరోని సంప్రదించారట. అయితే విజయ్‌ మాత్రం కొరటాల ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిన్నట్లు తెలుస్తోంది. డేట్స్‌ ఖాళీగా లేకపోవడం వల్లే కొరటాల ఆఫర్‌ని విజయ్‌ రిజెక్ట్‌ చేశాడట. ప్రస్తుతం విజయ్‌.. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో లైగర్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత శివ నిర్వాణ, సుకుమార్‌ దర్శకత్వంలో సినిమాలు చేయాల్సి ఉంది. ఇలా రాబోయే రెండేళ్ల వరకు విజయ్‌ డేట్స్‌ ఖాళీగా లేవట. అందుకే కొరటాల ప్రాజెక్ట్‌కి నో చెప్పాడట. ఇక విజయ్‌ నో చెప్పడంతో ఈ ప్రాజెక్టు కోసం మరో హీరోని వెతికే పనిలో ఉన్నాడట కొరటాల శివ.

చదవండి:
సోహైల్‌కు ఖరీదైన బైక్‌ బహుమతిగా ఇచ్చిన ఫ్యాన్‌‌

ఆ కారణంతో క్రేజీ ఆఫర్లు వదులుకున్న ‘చిట్టి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement