RRR Hero Jr NTR Focused On Koratala Siva Project - Sakshi
Sakshi News home page

Jr NTR New Movie: బరువు తగ్గించాలనుకుంటున్న ఎన్టీఆర్‌, అందుకోసమేనట

Published Thu, Mar 31 2022 2:23 PM | Last Updated on Thu, Mar 31 2022 4:32 PM

Jr NTR Focused On Koratala Siva Project - Sakshi

దాదాపు నాలుగేళ్లుగా అటు ఎన్టీఆర్‌ అభిమానులు, ఇటు రామ్‌ చరణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ థియేటర్స్‌లోకి వచ్చింది. ప్రస్తుతం రికార్డులే టార్గెట్‌గా దూసుకెళ్తోంది. ఆర్‌ర్‌ఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి తారక్‌, చరణ్‌ చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్‌ కాస్త అసంతృప్తిగా ఉన్నాడని పుకార్లు వచ్చినప్పటికీ.. ఇటీవల ఆయన విడుదల చేసిన ప్రత్యేకమైన లేఖతో వాటికి చెక్‌ పడింది.

ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు తమ తదుపరి సినిమాలపై ఫోకస్‌ పెట్టారు. చరణ్‌ ఇప్పటికే శంకర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ తన  నెక్ట్స్ మూవీ కొరటాల శివతో ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాస్త విరామం తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్నాడట తారక్‌.ఈ రెండు నెలలు విహార యాత్రకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.అంతే కాదు కొరటాల సినిమాలో క్యారెక్టర్ కోసం భారీగా వెయిట్ కూడా తగ్గాలనుకుంటున్నాడట. అరవింద సమేత లుక్ లోకి మారిపోయేందుకు టైగర్ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియాభ‌ట్ ఫీ మేల్‌లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. అనిరుథ్‌ సంగీతం అందిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement