‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు.. స్పందించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ | Devara Movie Pre Release Event Cancelled Due To This Reason, Jr NTR Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌ అత్యుత్సాహం.. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. బాధాకరమన్న తారక్‌

Published Sun, Sep 22 2024 8:56 PM | Last Updated on Mon, Sep 23 2024 9:52 AM

Devara Movie Pre Release Event Cancelled Due To This Reason

దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌ అయింది. భద్రతా పరమైన కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం దేవర. సెప్టెంబర్‌ 27న  ఈ చిత్రం రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో నేడు(సెప్టెంబర్‌ 22) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు. 

(చదవండి: 'దేవర' రెండో ట్రైలర్‌ విడుదల)

ఈ ఈవెంట్‌కి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్‌ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో కొంతమంది ఫ్యాన్స్‌ గొడవకు దిగారు. అత్యుత్సాహంతో హోటల్‌ అద్దాలను పగులగొట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠి చార్జీ చేసి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు ఈవెంట్‌నే రద్దు చేశారు. దీంతో నిరుత్సాహంతో ఫ్యాన్స్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

రుణపడి ఉంటా..
'దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగకపోవడం చాలా బాధాకరం. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలనుకున్నాను. సెక్యూరిటీ కారణాల వల్ల ఈవెంట్‌ క్యాన్సిల్‌ చేశాం. దీనికి నిర్మాతలను, ఈవెంట్‌ ఆర్గనైజర్లను నిందించడం తప్పని నా అభిప్రాయం. మీరు కురిపించే ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఈరోజు కుదరకపోయినా సెప్టెంబర్‌ 27న మీ ముందుకు వస్తున్నాం. మీ ఆశీర్వాదం దేవరకు అవసరం. మీరు కాలర్‌ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే నా బాధ్యత' అని ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

దేవర విషయానికొస్తే.. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన చిత్రమిది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ఈ నెల 27న రిలీజ్‌ కానుంది. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement