ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకులు మారిపోయారు. కథలో కొత్తదనం ఉంటేకానీ థియేటర్స్‌కి రావడం లేదు. పెద్ద హీరో సినిమా అయినా సరే.. కథ నచ్చలేదంటే ఫ్యాన్స్ సైతం టికెట్ పెట్టి సినిమా చూడడానికి ముందుకు రావడం లేదు. అందుకే మన దర్శకనిర్మాతలు డిఫరెంట్ స్టోరీస్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయినా కూడా ఓ చిన్న కామన్ పాయింట్ కనిపించినా.. చాలు మరొక సినిమాతో పోల్చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ తర్వాత ఈ కథ పలానా సినిమాను గుర్తు చేస్తుందని చెప్పేవారు.
(చదవండి: ఆ హిట్ డైరెక్టర్‌తో రజనీకాంత్ సినిమా..!)
కానీ ఇప్పుడు అయితే ఫస్ట్ లుక్ మొదలు టీజర్, ట్రైలర్‌ని చూసి వేరే సినిమాలతో పోలిక పెడుతున్నారు. అసలు కథ ఏంటి అనేది తెలియకుండానే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాపై కూడా నెట్టింట అలాంటి ట్రోల్స్ వచ్చాయి. తాజాగా డైరెక్టర్ కొరటాల ఆ ట్రోల్స్‌పై స్పందించారు.
‘ఆంధ్రావాలా’ తో పోలిక
కొరటాల శివ దర్శకత్వం మహించిన ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. అయితే ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ వరకు బయటకు చెప్పలేదు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఎన్టీఆర్‌ని తండ్రి, కొడుకుల పాత్రల్లో చూపించారు. అప్పటి నుంచి ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలైంది. ఈ సినిమా కథను ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’తో పోల్చుతూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఆంధ్రావాలా’లో ఎన్టీఆర్ తండ్రి, కొడుకు పాత్రల్లో నటించాడు. దేవరలో అలాంటి పాత్రల్లోనే కనిపించాడు. ఈ సినిమా కథతో దేవరకు సంబంధం ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
అలా ఎలా పోలుస్తారు: కొరటాల
తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆంధ్రావాలా’ట్రోలింగ్‌పై కొరటాల స్పందించారు. ఈ సినిమాలో హీరో తండ్రికొడుకులు నటించినంత మాత్రనా అదే కథ అంటె ఎలా? అసలు ఆ కథతో దీనికి సంబంధమే లేదు. ఒక హీరో తండ్రికొడుకులుగా నటించిన సినిమాలు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి(నవ్వుతూ..). అసలు అదేం పోలిక? ఇది కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ’ అని కొరటాల అన్నారు. ఇక మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ.. సోషల్ మీడియాను చెడును ప్రచారం చేయడానికే ఎక్కువగా వాడుతున్నారని, అలా కాకుండా మంచికి ఉయోగించాలని కోరారు. నెగెటివల్ కామెంట్ చేయడం వేరే..ద్వేషించడం వేరు. కామెంట్ చేయడంలో తప్పలేదు..ద్వేషించకూడదు అని కొరటాల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment