మెగా మేనల్లుడి పోస్టర్‌ భలే ఉందిగా! | Vaishnav Tej New Movie Poster Released | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 20 2019 9:10 PM | Last Updated on Sun, Jan 20 2019 9:11 PM

Vaishnav Tej New Movie Poster Released - Sakshi

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతోన్న సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడిగా సాయి ధరమ్‌ తేజ్‌ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగా.. ప్రస్తుతం ఆయన సోదరుడు వైష్ణవ్‌తేజ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. ఈ చిత్రానికి రేపే ముహుర్తం ఫిక్స్‌ కాగా.. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితమే చిత్రయూనిట్‌ విడుదల చేసింది. 

వైష్ణవ్‌ తేజ్‌ జాలరి గెటప్‌లో ఉన్న ఈ పోస్టర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. సుకుమార్‌ రైటింగ్స్‌, మైత్రి మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి రాక్‌ స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చనున్నారు. రేపు జరిగే ముహుర్తపు కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనుండగా.. మిగతా మెగాహీరోలు కూడా హాజరుకానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement