సల్మాన్‌ ఖాన్‌ సీటీమార్‌ | Salman Khan Wants To Dance For Seeti Maar Song | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఖాన్‌ సీటీమార్‌

Published Thu, Jun 11 2020 12:44 AM | Last Updated on Thu, Jun 11 2020 12:44 AM

Salman Khan Wants To Dance For Seeti Maar Song - Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సీటీ మార్‌ అంటూ చిందేసేందుకు సిద్ధమవుతున్నారు. తన తాజా చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’లో తెలుగు ‘సీటీ మార్‌’ పాటని రీమిక్స్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’. ఈ చిత్రాన్ని రంజాన్‌ సందర్భంగా మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా నెలకొన్న లాక్‌ డౌన్‌తో సినిమా విడుదల వాయిదా పడింది. తాజా సమాచారం ఏంటంటే.. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రంలోని హిట్‌ సాంగ్‌ ‘సీటీ మార్‌.. సీటీ మార్‌..’ని ‘రాధే..’ చిత్రం కోసం  రీమిక్స్‌ చేయనున్నారట. ఒరిజినల్‌ తెలుగు వెర్షన్‌కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ హిందీ రీమిక్స్‌ పాటకి కూడా స్వరాలు అందించనున్నారని సమాచారం. కాగా అల్లు అర్జున్‌ ‘ఆర్య 2’ చిత్రంలోని ‘రింగ రింగ..’ పాటని సల్మాన్‌ ఖాన్‌ ‘రెడీ’ చిత్రంలో ‘ధింక చికా...’ అంటూ రీమిక్స్‌ చేయగా సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘సీటీ మార్‌...’ హిట్‌ ట్యూన్‌ కాబట్టి రీమిక్స్‌ ట్యూన్‌ కూడా ఆకట్టుకుంటుందని ఊహించవచ్చు. దిశా పటాని, రణదీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌ తదితరులు నటించిన ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ చిత్రాన్ని రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్స్, సోహైల్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్, సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement