చంటి అవుట్‌, నేనే వెళ్లిపోతానంటూ బోరున ఏడ్చిన ఇనయ | Bigg Boss 6 Telugu Elimination: Chalaki Chanti Out From BB Show | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: చంటి ఎలిమినేట్‌, తానే వెళ్లిపోతానంటూ ఇనయ శోకం..

Published Sun, Oct 9 2022 10:27 PM | Last Updated on Tue, Oct 11 2022 5:18 PM

Bigg Boss 6 Telugu Elimination: Chalaki Chanti Out From BB Show - Sakshi

Bigg Boss Telugu 6, Episode 36: బిగ్‌బాస్‌ షోలో సండే వచ్చిందంటే చాలు హౌస్‌మేట్స్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. తమలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటుంటారు. మరోవైపు వారి టెన్షన్‌ను పోగొట్టేందుకు నాగ్‌ ఫన్‌ టాస్కులు ఇస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తుంటాడు. అయితే ఈసారి దేవిశ్రీప్రసాద్‌ స్టేజీపైకి వచ్చి సందడి రెట్టింపు చేశాడు. తను కంపోజ్‌ చేసిన ఓ పిల్లా సాంగ్‌ను అందరికీ వినిపించాడు.

అనంతరం కంటెస్టెంట్లతో ఓ ఫన్‌ గేమ్‌ ఆడించి రిలాక్స్‌ చేసిన నాగ్‌ ఆ తర్వాత వాసంతి సేఫ్‌ అయినట్లు వెల్లడించాడు. తర్వాత సామెతలను ఇంటిసభ్యులకు అంకితం చేయమన్నాడు నాగ్‌. ఈ క్రమంలో ఏమిరా పడ్డావ్‌ అంటే, అదొక పల్టీలే అన్నాడంట అనే సామెతను ఫైమా రాజ్‌కు డెడికేట్‌ చేసింది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్న సామెత రోహిత్‌కు సెట్టవుతుందన్నాడు బాలాదిత్య. పచ్చకామెర్లు వచ్చినవాళ్లకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్న వాక్యం బాలాదిత్యకు సరిపోతుందన్నాడు ఆదిరెడ్డి.

ఆకై మేకైనాడు అనేది శ్రీహాన్‌కు సరిపోతుందంది గీతూ. గీతూ అగ్గికి ఆద్యం పోస్తుందని చెప్పింది ఇనయ. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అనేది కీర్తికి సూటవుతుందన్నాడు చంటి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి సామెత గీతూకే ఎక్కువ సరిపోతుందన్నాడు మెరీనా. ఏదో అనుకుంటే ఇనయ ఆకే మేకై కూర్చుందన్నాడు రాజ్‌. ఇనయకు చింత చచ్చినా పులుపు చావదని చెప్పింది వాసంతి. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు, చింత చచ్చినా పులుపు చావదు, కంచె చేను మేసినట్లు, అందితే జుట్టు అందకపోతే కాళ్లు సామెతలన్నీ రేవంత్‌కు అంకితమిచ్చారు మిగతా హౌస్‌మేట్స్‌.

చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లు అనే సామెతను అర్జున్‌కు బాగా సెట్టవుతుందన్నాడు శ్రీహాన్‌. అర్జున్‌కు కుక్క తోక వంకర అని తేల్చేశాడు రేవంత్‌. అనంతరం నాగార్జున.. చంటి ఎలిమినేట్‌ అని ప్రకటించగానే ఇనయ కన్నీరుమున్నీరుగా ఏడ్చేసింది. ప్లీజ్‌ చంటిగారు, నేనే వెళ్లిపోతానంటూ శోకమందుకోవడం గమనార్హం.

చదవండి: నయన్‌ ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement