Bigg Boss 6 Telugu: These Contestant Will Be Eliminate For This Week - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: పస్తులుంటున్న ఆ కంటెస్టెంటే ఎలిమినేట్‌?

Published Sat, Oct 8 2022 3:39 PM | Last Updated on Sat, Oct 8 2022 6:12 PM

Bigg Boss Telugu 6: These Contestant Will Be Eliminate For This Week - Sakshi

బిగ్‌బాస్‌ షోలో ఉత్కంఠగా సాగే ప్రక్రియ నామినేషన్‌, ఎలిమినేషన్‌. కంటెస్టెంట్లు ఎంత ఆడినా, ఎంటర్‌టైన్‌ చేసినా అది ఈ ఎలిమినేషన్‌ గండం నుంచి గట్టెక్కడానికే! చూస్తుండగానే బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ ఐదో వారం ముగింపుకు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో బాలాదిత్య, వాసంతి, ఇనయ, చంటి, ఫైమా, అర్జున్‌, ఆదిరెడ్డి, మెరీనా ఉన్నారు. వీరిలో ఇనయ, ఆదిరెడ్డిలకు బాగానే ఓట్లు పడ్డాయి. ఫైమా అటు హౌస్‌మేట్స్‌నే కాదు ఇటు ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్‌ చేయడంతో ఆమెకు కూడా ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అర్జున్‌ కల్యాణ్‌కు సింపథీ ఓట్లు పడుతున్నట్లు కనిపిస్తోంది. దీని కారణంగా అతడు సేఫ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.

వాసంతి గేమ్‌ ఆడకపోయినా బాపు బొమ్మలా అందంగా ముస్తాబై హౌస్‌కు అందాన్ని తీసుకొస్తుండటంతో ఆమె కూడా సేవ్‌ అయ్యేట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన బాలాదిత్య, చంటి, మెరీనా.. ముగ్గురు డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. వీరిలో బాలాదిత్య, మెరీనా సంగతి కాస్త పక్కనపెడితే చంటి మాత్రం చాలా డల్‌ అయ్యాడు. రెండు రోజుల నుంచి సరిగా తిండి తినకుండా, పర్ఫామెన్స్‌తో కూడా మెప్పించలేకపోతుండటంతో బిగ్‌బాస్‌ టీమ్‌ అతడిని పంపించే యోచనలో ఉందని ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా ఉంది.

అతడికి కూడా హౌస్‌ నుంచి బయటకు ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా? అని ఆతృతగా ఉండటం గమనార్హం. తను తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కు తగ్గట్లుగా కంటెంట్‌ ఇవ్వని చంటిని పంపించేస్తేనే బెటర్‌ అని కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు. మరి ఈ వారం చంటి ఎలిమినేట్‌ అవుతాడా? లేదంటే మిగతా ఎవరైనా ఎలిమినేట్‌ అయ్యారా? అనేది తెలియాలంటే నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే!

చదవండి: ఆ హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపిన అర్జున్‌ కల్యాణ్‌
అర్జున్‌ను ఎలాగైనా ఏడిపిస్తా.. శ్రీసత్య శపథం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement