
‘‘మూడు పాత్రల మధ్య జరిగిన అసాధారణ ఘటన వల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘దేవి శ్రీ ప్రసాద్’. పూజా రామచంద్రన్, భూపాల్‌రాజు, ధనరాజ్, మనోజ్ నందం ప్రధానపాత్రల్లో శ్రీకిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. యశ్వంత్ మూవీస్ సమర్పణలో డి. వెంకటేష్, ఆర్.వి. రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ దర్శకుడు కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘టైటిల్ వైవిధ్యంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే కొత్త కథాంశంతో రూపొందిన సినిమా అనిపిస్తోంది. శ్రీకృష్ణతో నాకు పరిచయం ఉంది. తన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు.
ఈ సినిమా కూడా అలాగే ఉంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఓ మంచి వైవిధ్యమైన కథని ఎంకరేజ్ చేయాలని ఈ సినిమాలో నేనూ భాగస్వామి అయ్యా. అమెరికాలోనూ 45 థియేటర్స్‌లో ఈ చిత్రం విడదలవుతోంది’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన డి. వెంకటేష్. ‘‘ముగ్గురు యువకుల మధ్య జరిVó విచిత్రమైన కథ ఇది. దెయ్యం ఉంటుందా? లేదా? అన్నది సస్పెన్స్’’ అన్నారు శ్రీకిషోర్. పూజా రామచంద్రన్, భూపాల్‌రాజు, ధనరాజ్, మనోజ్ నందం, ఆక్రోష్, రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment