మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి.., ఇంత వరకు టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ కాలేదు. అయితే మురుగదాస్ సినిమా తరువాత మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా టైటిల్పై క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం మహేష్, కొరటాల శివల సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తన స్టూడియోలో జరుగుతున్న మ్యూజిక్ సిట్టింగ్స్ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్, హ్యాష్ ట్యాగ్లలో 'భరత్ అనే నేను' అనే ట్యాగ్ను పోస్ట్ చేశాడు. చాలా రోజులుగా ఈ టైటిల్లో ప్రచారంలో ఉన్నా.., యూనిట్ సభ్యుల నుంచి మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు. ప్రస్తుతం దేవీ శ్రీ ట్వీట్తో టైటిల్ ఇదే అన్న క్లారిటీ వచ్చేసిందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.
Had an Awesome time composing 4 @sivakoratala sir & @urstrulyMahesh sir's #BHARATHaneNENU !! Thx 4 joinin us @dop007 sir 😁🎹🎵 wit my team🎹🎻 pic.twitter.com/voleTG3Czp
— DEVI SRI PRASAD (@ThisIsDSP) 15 March 2017